News March 13, 2025

MBNR : హోలీ పండుగ.. జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు

image

మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఎస్పీ జానకి కీలక సూచనలు చేశారు. 14వ తేదీ ఉదయం 6 -12 మధ్యాహ్నం గంటల వరకు హోలీ పండుగను జరుపుకోవాలన్నారు. బలవంతంగా రంగులు పూయడం, హోలీ పండుగ ఇష్టపడని వ్యక్తులపై, వాహనాలపై రంగు నీరు చల్లడం నిషేధమన్నారు. పబ్లిక్ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అల్లర్లు చేయడం వీధులలో ఇష్టానుసారంగా తిరగడం అనుమతి లేదన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా ఉంటుందన్నారు.

Similar News

News October 17, 2025

కురుమూర్తి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

image

దేవరకద్ర నియోజకవర్గం కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

News October 17, 2025

‘ఏక్ పేడ్ మా కే నామ్’.. విస్తరించండి: గవర్నర్

image

విద్యార్థులు ఒక్కొక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలి పీయూ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. పీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదాన వేడుక మాత్రమే కాదు, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర సందర్భం. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని’ సూచించారు.

News October 17, 2025

MBNR: రూ.100 కోట్ల ‘PM–USHA’ పనులు వేగవంతం- VC

image

పీయూలో ఇంజినీరింగ్ కళాశాల,లా కళాశాల, కొత్త హాస్టళ్లు, పరిశోధన కేంద్రాలు వంటి ప్రాజెక్టులు రూ.100 కోట్ల PM–USHA పథకం కింద వేగంగా అభివృద్ధి చెందుతుందని వీసీ ఆచార్య డాక్టర్ జిఎన్.శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఐదు క్యాంపస్ కళాశాలలు, 3 పీజీ సెంటర్లు, 24 కోర్సులు కొనసాగుతున్నాయని, NSS, క్రీడా, పర్యావరణ, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని’ ప్రశంసించారు.