News November 13, 2025

MBNR: అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ఫీజు చెల్లింపులకు నేడే తుది గడువు

image

డా.బీ.ఆర్.అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో 2019-2024 మధ్య చేరిన డిగ్రీ 1వ, 3వ సంవత్సరం విద్యార్థులు ఫీజు చెల్లించడానికి నవంబర్ 13 తుది గడువు అని పాలమూరు ఓపెన్ వర్సిటీ అధికారులు తెలిపారు. అలాగే, 2022-2024 మధ్య MA, MCom, MSc కోర్సుల్లో చేరిన 2వ సంవత్సరం విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చని వివరించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Similar News

News November 13, 2025

NLG: ఇందిరమ్మ లబ్ధిదారులకు మరుగుదొడ్లు

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్దిపొందిన వారికి వ్యక్తిగత మరుగుదొడ్లు కేటాయించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 34,023 ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో 19,697 ఇండ్లు మంజూరయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి వీరికి మరుగుదొడ్లను మంజూరు చేయనున్నారు.

News November 13, 2025

ఆత్మకూరులో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 13, 2025

తిరుమల: అన్ని వేళ్లు వైవీ సుబ్బారెడ్డి వైపే…!

image

తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో అన్ని వేళ్లు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వైపే చూపిస్తున్నాయి. గతంలో ఉన్న టెండర్ల విధానంలో మార్పులు తీసుకురావడంతో ఆయన తీరుపై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది. దానికి తోడు ఆయన పీఏ చిన్న అప్పన్న అరెస్టుతో కూడా సుబ్బారెడ్డిపై అనేక ఆరోపణలకు కారణమవుతుంది.