News April 16, 2025
MBNR: అధికారులు ఎందుకు పరామర్శించలేదు: మాజీ మంత్రి

ఇటీవల దివిటిపల్లి డబుల్ బెడ్ రూమ్‌లో నివాసం ఉంటున్న ముగ్గురు వ్యక్తులు సమీపంలో ఉన్న క్వారీలో నీటిలో మునిగిపోయి మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబీకులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈరోజు పరామర్శించారు. ముగ్గురు చనిపోతే కనీసం కలెక్టర్, ఎస్పీ వచ్చి ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలని ఆదుకోవాలన్నారు. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.
Similar News
News April 19, 2025
ఆ హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చు: కూనంనేని

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చని MLA కూనంనేని సాంబ శివరావు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి డోలాయమానంలో ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎవరికీ రుపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు.
News April 19, 2025
SUMMER హాలీడేస్.. ఆసిఫాబాద్‌ను చుట్టేద్దాం చలో

వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఎక్కడికి వెళ్లాలో ఆలోచిస్తున్నారా? ప్రకృతి రమణీయత చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు మన జిల్లాలోనే ఉన్నాయి. ప్రాణహిత నది, పాలరాపులగుట్ట, సిద్ధప్ప గుహలు, సిర్పూర్ కోట, వట్టి వాగు, ఆడ ప్రాజెక్టు, జోడేఘాట్ కొమరం భీమ్ స్మృతి వనం, కంకాలమ్మ గుట్ట, శివ మల్లన్న దేవస్థానం, గంగాపూర్ బాలాజీ ఆలయాలున్నాయి. అందమైన ప్రదేశాలు దర్శించి మరపురాని జ్ఞాపకాలను సొంతం చేసుకుందాం..!
News April 19, 2025
SUMMER HOLIDAYS.. మంచిర్యాల చుట్టేద్దాం చలో

వేసవి సెలవులు షురూ కావడంతో ఎక్కడికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా? ప్రకృతి రమణీయత, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. గాంధారి ఖిల్లా, గూడెం శ్రీసత్యనారాయణ స్వామి దేవాలయం, కవ్వాల్ టైగర్ రిజర్వ్, శివ్వారం వన్యప్రాణుల అభయారణ్యం, గోదావరి నది, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్నాయి. ఈ అందమైన ప్రదేశాలను సందర్శించి మరపురాని జ్ఞాపకాలు సొంతం చేసుకోండి!