News February 12, 2025

MBNR: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

లక్ష్మీనారాయణ కంపౌండ్‌లో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. జడ్చర్ల మండలం జయప్రకాశ్‌నగర్‌కు చెందిన శంకర్(33) ఇంటి నుంచి మేస్త్రీ పనికోసం బయలుదేరాడు. ఎప్పుడు.. ఎలా.. ఏం జరిగిందో తెలియదుకాని కాంపౌండ్ వద్ద రోడ్డుపై పడి మృతిచెందాడు. మృతుడికి మూర్ఛ వచ్చేదని, మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదైంది.

Similar News

News March 2, 2026

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

నల్గొండ మండలం చందనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామంలోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంటు సమీపంలో నకిరేకల్ నుంచి నల్గొండకు వస్తున్న బైక్, ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు చనిపోయారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News March 2, 2026

మదనపల్లెలో అధికారుల సస్పెండ్

image

మదనపల్లె, నిమ్మనపల్లె సహకార బ్యాంకుల్లో రుణాల మంజూరులో గోల్‌మాల్ జరిగింది. బంగారు రుణాల మంజూరులో నిమనపల్లె సహకార బ్యాంక్ త్రిమెన్ కమిటీ సీఈవోలు హరినాథ రెడ్డి, కరుణాకర రెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.కోట్లు పక్కదారి పట్టాయని తెలుస్తోంది. దీంతో సీఈవోలను ఆ బ్యాంక్ జిల్లా కమిటీ సస్పెండ్ చేసింది. మదనపల్లె సహకార బ్యాంకు ఆఫీసియల్ పర్సన్ ఇన్‌ఛార్జ్ రఘునాథరెడ్డి సైతం సస్పెండ్ అయ్యారు.

News March 2, 2026

ఖమ్మం: 6 నెలలు రేషన్ తీసుకోకుంటే కష్టమే

image

వరుసగా ఆరు నెలల పాటు రేషన్ బియ్యం తీసుకోని లబ్ధిదారులపై పౌర సరఫరాల శాఖ ఆరా తీస్తోంది. క్షేత్రస్థాయి విచారణలో అనర్హులుగా తేలితే కార్డులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 7 లక్షల పైచిలుకు కార్డులున్నాయి. వలస వెళ్లిన వారి వివరాలను తహశీల్దార్లు సేకరిస్తున్నారు. కార్డుదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.