News February 6, 2025
MBNR: అన్నం ముద్ద ఇరుక్కుని మహిళ మృతి

అన్నం తింటుండగా ముద్ద గొంతులో ఇరుక్కుని ఓ మహిళ మృతి చెందిన ఘటన MBNR జిల్లా నవాబ్‌పేట మండల కేంద్రంలో జరిగింది. స్తానికులు తెలిపిన వివరాల మేరకు.. నవాబ్‌పేటకు చెందిన మాడమోని జయమ్మ(57) నిన్న రాత్రి భోజనం చేస్తూ ఉండగా ముద్ద ఇరుక్కుంది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు MBNRలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో చనిపోయింది.
Similar News
News December 23, 2025
నేడు గద్వాల్, వనపర్తి జిల్లాలో గవర్నర్ పర్యటన

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పర్యటించనున్నారు. అలంపూర్ జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం గద్వాల కలెక్టరేట్‌లో చేనేత స్టాళ్లను పరిశీలిస్తారు. వనపర్తి కలెక్టరేట్‌లో అభివృద్ధి పథకాల స్టాళ్ల సందర్శన, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రెండు జిల్లాలకు చెందిన ప్రముఖ కవులు, కళాకారులు, జాతీయ స్థాయి ప్రతిభావంతులతో గవర్నర్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
News December 23, 2025
HYD: భార్యే.. ప్రియుడితో కలిసి చంపేసింది!

HYDలో ఇటీవల జరిగిన ఘటనలతో మానవ సంబంధాలు ప్రశ్నార్థకం అవుతున్నాయి. తాత్కాలిక ఆనందం కోసం పూర్ణిమ నూరేళ్ల దాంపత్య జీవితాన్ని బలిచేసుకుంది. భార్యాభర్తలు పూర్ణిమ(36), అశోక్(45) బోడుప్పల్‌లో నివసిస్తున్నారు. ఆమెకు మహేశ్(22)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అడ్డుగా ఉన్నాడని భర్తను మహేశ్ అతడి ఫ్రెండ్ సాయితో కలిసి చున్నీ మెడకు బిగించి హత్య చేసింది. దర్యాప్తు అనంతరం ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు.
News December 23, 2025
ట్రంప్ నోట మళ్లీ అదే మాట!

భారత్, PAK మధ్య అణు యుద్ధం జరగకుండా ఆపినట్లు US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు. దీంతో 10మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలను కాపాడినట్లు పాక్ PM చెప్పినట్లు వివరించారు. పహల్గామ్ దాడి తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో 8 విమానాలు నేలకొరిగాయన్నారు. 8 యుద్ధాలు ఆపానని, తాను పరిష్కరించని ఏకైక యుద్ధం ఉక్రెయిన్-రష్యాదే అని తెలిపారు. పుతిన్, జెలెన్‌స్కీ మధ్య విపరీతమైన ద్వేషం ఉందని చెప్పారు.


