News March 3, 2025

MBNR: అరుణాచలానికి పాలమూరు నుంచి ప్రత్యేక బస్సులు.!

image

తమిళనాడు రాష్ట్రంలోని ప్రత్యేక పుణ్యక్షేత్రం అరుణాచలానికి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈనెల 12న మహబూబ్ నగర్ డిపో నుంచి బస్సు వెళ్లనున్నట్లు తెలిపారు. మార్చి 13 సా.6 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. మార్చి 14న అక్కడి నుంచి బయలుదేరి 15న ఉదయం మహబూబ్ నగర్ చేరుకుంటుందని అన్నారు. ప్రయాణికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Similar News

News February 26, 2026

MBNR: ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల బందోబస్తు పరిశీలించిన ఎస్పీ

image

మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల సందర్భంగా ప్రభుత్వ బాలుర కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ డి.జానకి సందర్శించారు. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు, కఠిన పర్యవేక్షణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 26, 2026

సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం బుక్ చేసుకోండి

image

భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం ఒక ప్యాకెట్ ధర 151 రూపాయలు పెట్టి బుక్ చేసుకోవాలని రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ గురువారం అన్నారు. జిల్లా కార్యాలయంలో అందుకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవాలని సూచించారు. నేరుగా ఇంటికే తలంబ్రాలు చేరవేస్తారని తెలిపారు. మరింత సమాచారంకు 9154298637 సంప్రదించాలన్నారు.

News February 26, 2026

MBNR: ఐఐటీ ఢిల్లీ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు స్ఫూర్తిదాయక ప్రయాణం

image

2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి ఖుష్బూ గుప్త ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా నియామకం అయ్యారు. తొలుత బీహార్ కేడర్‌కు ఎంపికైన ఆమె, వివాహానంతరం తెలంగాణ కేడర్‌కు మారారు. ఢిల్లీ ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన ఆమె 2018 యూపీఎస్సీ పరీక్షలో AIR 80 సాధించారు. పంజాబ్‌లోని భదౌర్ ఆమె స్వస్థలం. ఐటీడీఏ పీవోగా పనిచేసిన సమయంలో గిరిజన బాలికల విద్యపై విశేష సేవలు అందించారు.