News March 9, 2025

MBNR: ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధురాలు.!

image

ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సీసీ కుంట మండలం కురుమూర్తి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్‌లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి బాలకిష్టమ్మ మానసికస్థితి సరిగ్గా లేక ఒంటరిగా ఉంటుంది. దుప్పటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొందని ఎస్ఐ తెలిపారు.

Similar News

News March 9, 2025

HYD: యాచారంలో 10 వేల కోళ్లు మృతి

image

కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్న రైతు పౌల్ట్రీ ఫామ్‌లో పెద్ద సంఖ్యలో కోళ్ల మృతితో రైతు విచారం వ్యక్తం చేశారు. నానక్‌నగర్‌లో రైతు చల్లా కృష్ణారెడ్డి పౌల్ట్రీ ఫాంలో అనుకోకుండా ఒక్కసారిగా పదివేల కోళ్లు మృతి చెందాయి. కోళ్లు చనిపోవడంతో దాదాపు రూ. 20 లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. జరిగిన నష్టాన్ని పరిశీలించి ఎలాగైనా ప్రభుత్వం, అధికారులు తనను ఆదుకోవాలని కోరారు. గుంతలో కోళ్లను పూడ్చిపెట్టారు.

News March 9, 2025

రైలులో ప్రసవించిన మహిళ

image

ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓమహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రైలులో ప్రయాణిస్తున్న మహిళకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికుల సహాయంతో డెలివరీ చేశారు. అనంతరం మథుర స్టేషన్‌లో తల్లి బిడ్డలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ Xలో పోస్ట్ చేసింది.

News March 9, 2025

IND VS NZ: హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి!

image

హైదరాబాద్‌లో ఛాంపియన్‌షిప్ ఫీవర్ నడుస్తోంది. భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ పెరిగింది. జనాలు మొత్తం టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మీద జనసంచారం తగ్గింది. సిటీలోని అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్‌లలోని LED టీవీల్లో మ్యాచ్‌ ప్రదర్శించగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండడంతో‌ మరింత ఆసక్తిగా నగరవాసులు వీక్షిస్తున్నారు.

error: Content is protected !!