News September 20, 2025

MBNR: ఆదివారం రామకొండ జాతర

image

మహబూబ్‌నగర్ జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకొండపై స్వయంభువుగా వెలసిన శ్రీరాముడి జాతర ఆదివారం జరగనుంది. సంవత్సరంలో అరుదుగా వచ్చే ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నారు. ఈ కొండపై లభించే ఏ వనమూలికలైనా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు.

Similar News

News September 19, 2025

MBNR: మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక సమావేశం

image

మహిళలు, బాలికలు, పిల్లల భద్రతకు సంబంధించి పోలీసులతో సమన్వయం చేసుకోడానికి CID SP అన్యోన్య ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. భరోసా, షీ టీమ్, AHTU, కళాబృందం సభ్యులు పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం పోలీసులు చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఈ బృందాలు కీలకపాత్ర పోషించాలని SP సూచించారు. అదనపు SP NB రత్నం, DSP వెంకటేశ్వర్లు, DCRB DSP రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News September 19, 2025

బాలానగర్: ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

image

బాలానగర్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలను కలెక్టర్ విజయేందిర బోయి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల వంటగదిని పరిశీలించి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ నాయక్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సౌమ్య, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News September 19, 2025

సీసీ కుంట: కురుమూర్తి స్వామికి రూ.2,02,75,000 ఆదాయం

image

చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు దీపావళి అమావాస్యకు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వివిధ వ్యాపారాల నిర్వహణకు నిర్వహించిన వేలంలో ఆలయానికి రూ.2,02,75,000 ఆదాయం వచ్చింది. కొబ్బరికాయల విక్రయానికి రూ.56.25 లక్షలు, పూజా సామగ్రికి రూ.16.50 లక్షలు, పులిహోర ప్రసాదం విక్రయానికి రూ.46 లక్షలు, తలనీలాల సేకరణకు రూ.32 లక్షలు పలికాయి.