News March 26, 2025
MBNR: ఆ కళాశాలలకు గమనిక

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2024-25 సంవత్సరంలోపు అఫిలియేషన్ ముగిసిన కళాశాల యాజమాన్యాలు తిరిగి అఫిలియేషన్ చేయించుకోవాలని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు మహమ్మద్ మేరాజుల్లా ఖాన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈనెల 31వ తేదీలోపు అఫిలియేషన్ చేయించుకునేందుకు అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కళాశాలల యాజమాన్యాలు ఉపయోగించుకోవాలని సూచించారు.
Similar News
News March 29, 2025
రోడ్డు ప్రమాదం.. IPS అధికారి దుర్మరణం

TG: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వారిలో మహారాష్ట్రకు చెందిన సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కాగా వీరంతా మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
News March 29, 2025
MNCL: పరీక్షకు 39 మంది విద్యార్థులు గైర్హాజరు

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్షా కేంద్రాల్లో శనివారం జరిగిన జీవ శాస్త్రం పరీక్షకు 9,198 మంది రెగ్యూలర్ విద్యార్థులకు గాను 9,176 మంది హాజరు కాగా 22 మంది గైర్హజరయ్యారు. గతంలో ఫెయిలైన 134 మంది విద్యార్థులకు గాను 117 మంది హాజరుకాగా 17 మంది గైర్హాజరైనట్లు డీఈవో యాదయ్య వెల్లడించారు.
News March 29, 2025
హనుమకొండ: పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి కొండ సురేఖ

ఉగాది పండుగ నేపథ్యంలో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మతైక సంఘం, వేద, అర్చక సంఘం వారి క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఉగాది పండుగ వేడుకలను ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంత్రి సూచించారు.