News March 24, 2025

MBNR: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో గద్వాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. గద్వాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News November 3, 2025

పార్వతీపురం: ‘గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి’

image

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ఎర్రసామంతవలస గ్రామ గిరిజన యువత ఉపాధి అవకాశాలు కల్పించాలని సోమవారం కలెక్టర్‌ను కోరారు. సబ్సిడీతో రుణాలిచ్చి వ్యాపారాలకు అవకాశం కల్పించాలని, గ్రామంలో ఐటీడీఏ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే గిరిజన యువతకు ఉద్యోగాలు లభిస్తాయని విజ్ఞప్తి చేశారు. కార్య‌క్ర‌మంలో AJAC సభ్యులు రాయల అరవింద్, నిమ్మక చిన్నారావు, రాయల హరిత సిదరపుమనోజ్ తదితరలు పాల్గొన్నారు.

News November 3, 2025

‘చక్ దే ఇండియా2’ తీయాలని డిమాండ్.. కారణమిదే

image

18 ఏళ్ల కిందటి ‘చక్ దే ఇండియా’ గుర్తుందా? ప్లేయర్‌గా గెలవని హాకీ వరల్డ్ కప్‌ను కోచ్‌గా కబీర్ ఖాన్(షారుఖ్) సాధించడమే కథ. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని డిమాండ్లు వస్తున్నాయి. మహిళల WC సాధించడంలో కోచ్ అమోల్ మజుందార్‌‌ది కీలక పాత్ర. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 11 వేల రన్స్ చేసినా ఆయన ఇంటర్నేషనల్ డెబ్యూ చేయలేదు. కోచ్‌గా తన కల నెరవేర్చుకున్న అమోల్ కథతో చక్ దే2 తీయాలని నెటిజన్లు కోరుతున్నారు. మీరేమంటారు?

News November 3, 2025

వైవీయూలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు కోసం ఇంటర్వ్యూ

image

కడపలోని వైవీయూలో బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఈనెల 6న ఉదయం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు బయోఇన్ఫర్మేటిక్స్ / బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ / ఎంటెక్ బయోఇన్ఫర్మేటిక్స్‌లో 5 ఏళ్ల MSc, నెట్/ సెట్/ పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాల కోసం yvu.edu.in ని సందర్శించాలన్నారు.