News March 24, 2025
MBNR: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో గద్వాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. గద్వాలలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 8, 2025
నాగిరెడ్డిపేట: పురుగుల మందు సేవించి వృద్ధురాలి మృతి

నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లి కలన్ గ్రామానికి చెందిన రోడ్డ రత్నవ్వ (70) పురుగుల మందు సేవించి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, జీవితంపై విరక్తి చెంది రత్నవ్వ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుమార్తె రోడ్డ సాయవ్వ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
News November 8, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

→మిర్యాలగూడ : మత్తు మాత్రలు అమ్ముతున్న ముఠా అరెస్ట్
→మునుగోడు: అయ్యప్ప స్వాములకు ముస్లిం అన్నదానం
→HYD-VJD హైవే 8 లేన్ల విస్తరణ: కోమటిరెడ్డి
→నల్లగొండ: చెరువుకు చేరుతున్న చేప.. 6 కోట్ల చేప పిల్లల పంపిణీ
→నల్లగొండ: ఎల్లలు MGU దాటిన ఖ్యాతి
→నల్లగొండ: ఈ ఇసుక ఎక్కడి నుంచి వస్తుందో..
→నల్లగొండ: పలువురు జడ్జీలకు స్థాన చలనం
→చిట్యాల: రోడ్డు ప్రమాదం.. కారు పూర్తిగా దగ్ధం
News November 8, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓అన్నపురెడ్డిపల్లి: పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్
✓దమ్మపేట: కలప పట్టివేత
✓ఫర్నిచర్ శిక్షణకు 11 మంది ఎంపిక: కలెక్టర్
✓ఇల్లందు, భద్రాచలం ఆసుపత్రి సేవలు భేష్.. CRM బృందం నివేదిక
✓మణుగూరు పార్టీ ఆఫీస్ కాంగ్రెస్‌దే: INTUC
✓రైతాంగ సమస్యలపై ఈనెల 12న గ్రామీణ బంద్: CPI(ML)
✓కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం
✓మాదకద్రవ్యాలు జీవితాలను నాశనం చేస్తాయి: ఆళ్లపల్లి ఎస్సై


