News April 12, 2025

MBNR: ఆ మండలంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో చిన్నచింతకుంటలో 39.7 డిగ్రీలు, భూత్పూర్ (M) కొత్త మొల్గర 39.6 డిగ్రీలు, నవాబుపేటలో 39.5 డిగ్రీలు, కోయిలకొండ (M) సిరివెంకటాపూర్‌లో 39.4 డిగ్రీలు, మిడ్జిల్ 39.3 డిగ్రీలు, కోయిలకొండ (M) పారుపల్లిలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

Similar News

News April 13, 2025

MBNR: ఈనెల 14లోగా దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

యువతకు ఉపాధి కల్పించేందుకుగానూ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసానికి ఆసక్తి గల వారంతా ఈనెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లాకలెక్టర్ విజయేంద్రబోయి శనివారం తెలిపారు. 21 నుంచి 60ఏళ్ల వరకు వయస్సున్న వారు రూ.లక్షన్నర వార్షిక ఆదాయం ఉన్న వారంతా సంబంధిత మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. యూనిట్ రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు ఉంటుందని ఆసక్తికలిగిన వారంతా సద్వినియోగపరుచుకోవాలన్నారు.

News April 13, 2025

కేటీఆర్ గాలి మాటలు మానుకో: MBNR ఎంపీ 

image

రాజకీయ లబ్ధి పొందేందుకు గాలి మాటలు మాట్లాడొద్దని ఎంపీ డీకే అరుణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హెచ్చరించారు. AP పర్యటనలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. HUC భూముల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి BJP ఎంపీ సహకరిస్తున్నాడని ఆరోపిస్తున్న కేటీఆర్ దమ్ముంటే ఎంపీ పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. పేరు చెప్పకుండా బీజేపీపై నిందలు వేస్తే ఖబర్దార్ అని తీవ్ర స్థాయిలో ఆమె హెచ్చరించారు.

News April 13, 2025

MBNR: దళితులను విస్మరించిన పార్టీ కాంగ్రెస్: ఎంపీ 

image

అంబేడ్కర్‌ను అడుగడుగున మోసం చేసింది కాంగ్రెస్ అని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాజ్యాంగంపై, పార్టీపై చేస్తున్న దుష్ప్రచారాలు తిప్పికొట్టి కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దళితుల సంక్షేమానికి, అంబేద్కర్‌ సంయాన్ అభియాన్ కార్యక్రమాలు 13 నుంచి 25 వరకు జరుగుతాయన్నారు.

error: Content is protected !!