News May 7, 2024

MBNR: ఇంకా ఐదు రోజులు మాత్రమే!

image

లోక్‌సభ ఎన్నికల సంగ్రామానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ లోక్ సభ అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈనెల 13న పోలింగ్ నిర్వహించనుండగా, 11న సాయంత్రం 5గంటల వరకు ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ఇంకా 5 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. MBNR, NGKL నియోజకవర్గాల్లో పెద్ద పట్టణాలు, పెద్ద గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యనేతలతో రహస్య భేటీలు నిర్వహిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

Similar News

News January 7, 2025

NGKL: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా అందిస్తాం: జూపల్లి

image

కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటంలోని గ్రామంలో రూ.40 ల‌క్ష‌ల ప్ర‌త్యేక అభివృద్ధి నిధుల‌తో ఆధునీక‌రించిన ప్రాథ‌మిక‌, జ‌డ్పీహెచ్ఎస్ భ‌వ‌నాల‌ను సోమవారం మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్రారంభించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ పాఠశాల్లో నాణ్య‌మైన విద్యా బోధ‌న అందిస్తామ‌ని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి మౌలిక వసతులతో వీటిని తీర్చిదిద్దుతామ‌ని అన్నారు.

News January 7, 2025

MBNR: బాలికల భద్రతకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జిల్లాలోని రెసిడెన్షియల్, కేజీబీవీ పాఠశాలలు, వసతి గృహాలలో బాలికల భద్రతకు అన్నిచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలు ఆమె మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డైట్ చార్జీల పెంపునకు అనుగుణంగా కామన్ మెన్ అమలు చేస్తూ నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. వంట గది, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆమె ఆదేశించారు.

News January 7, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔’జీపీ కార్మికులకు జీతాలు ఇవ్వాలి’:IFTU,PDSU
✔పిల్లలతో నిరసన తెలిపిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు
✔ప్రజావాణి..సమస్యలపై ప్రత్యేక ఫోకస్
✔రైతులకు కాంగ్రెస్ మోసం చేసింది:BRS
✔ధరూర్:రేపు భగీరథ నీటి సరఫరా బంద్
✔గ్రంథాలయాల ద్వారా విజ్ఞానం: జూపల్లి
✔MBNR:గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
✔అచ్చంపేట:తమ్ముడిపై కత్తితో దాడి చేసిన అన్న
✔MBNRలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
✔ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత