News April 24, 2025
MBNR: ఇంటర్ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్ !

2025-26 విద్యాసంవత్సరానికి గాను ఆంగ్ల మాధ్యమంలో ఉమ్మడి పాలమూరు పరిధిలోని దేవరకద్ర, నాగర్ కర్నూల్, నారాయణపేట మహాత్మా ఫూలే బీసీ గురుకుల(పురుషులు) డిగ్రీ కళాశాలలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జె.సత్యనారాయణరెడ్డి తెలిపారు. B.Sc, B.Com, B.A కోర్సుల్లో ఆసక్తిగల విద్యార్థులు అడ్మిషన్ కోసం నేరుగా కళాశాలలో సంప్రదించాలని/ సంబంధిత వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News April 24, 2025
భానుడి భగభగలు.. ఏకంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత

TG: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఏకంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాలలో 45.3, ఆదిలాబాద్-45.2, నిర్మల్-45.2, మంచిర్యాల-45.1, ఆసిఫాబాద్-45, నల్గొండ-44.9, కామారెడ్డి-44.6, కరీంనగర్‌లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొట్టాయి. ఐఎస్ సదన్‌లో అత్యధికంగా 42, మాదాపూర్‌లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
News April 24, 2025
పరిశ్రమలు నెలకొల్పే ఔత్సాహికులకు పూర్తి సహకారం: కలెక్టర్

పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక ఔత్సాహికులకు అన్ని విధాలుగా పూర్తి సహకారం అందించాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మాణాలకు, పరిశ్రమల నిర్వహణకు అవసరమైన నీటి వనరులను సమకూర్చాలన్నారు. భూ సేకరణ, సింగిల్ విండో క్లియరెన్స్ అంశాల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
News April 24, 2025
ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తప్పని నీటి కష్టాలు

ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నీటి కష్టాలు పొంచి ఉన్నాయి. ఓ పక్క భూగర్భ జలాలు అడుగంటడం, మరో పక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరాతో కష్టాలు తప్పేలా లేవు. అంతేకాక బోర్ల ద్వారా కూడా సరఫరా తగ్గిపోతుండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఈ ఏడాది నీళ్ల ముప్పు ఎదురుకానుంది. ఖమ్మం నగరంలో మంచినీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.