News February 3, 2025
MBNR: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. వివరాలు ఇలా !

‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం ద్వారా రెండు విడతల్లో రూ.12 వేలు ఇస్తామని సర్కార్ ప్రకటించింది. మొదటి విడత లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. MBNR-13,909, NGKL-12,284, GDWL-10,380, NRPT-8,180, WNPT-9,978 మంది అర్హులని అధికారులు గుర్తించారు. ఆహార భద్రత కార్డు కుటుంబం కలిగి.. భూమిలేని రైతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 దినాలు కూలీగా పని చేసినట్లు మస్టర్‌లో నమోదై ఉండే వారు అర్హులుగా తెలిపింది.
Similar News
News July 6, 2025
GHMC ఆస్తులపై DGPS సర్వే

గ్రేటర్ HYDలో GHMC ఆస్తుల డీజీపీఎస్ సర్వేకు రంగం సిద్ధమైంది. చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో స్థిరాస్తులు, ఓపెన్ లేఅవుట్లు, పార్కులు, స్థలాలు కమ్యూనిటీ హాల్స్ సహా అన్ని వివరాలను సర్వే చేయించనున్నారు. సర్వే డిజిటలైజేషన్ కోసం కన్సల్టెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానించింది. కార్యాలయ భవనాల నుంచి మున్సిపల్ షాపుల దాకా అన్ని వివరాలు పొందుపరచునున్నారు.
News July 6, 2025
భద్రకాళి ఆలయంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ

భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులు సజావుగా దర్శనం చేసుకునేందుకు గాను ముందస్తు చర్యలు తీసుకోవాలని మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపికి ఏఎస్పీ పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
News July 6, 2025
LEAP యాప్‌లో పొందుపరచాలి: కలెక్టర్

ఈనెల 10న ఏలూరు జిల్లాలో జరిగే మెగా పేరెంట్స్ మీట్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో ఆమె ఏర్పాట్లను సమీక్షించారు. ‘LEAP యాప్’లో కార్యక్రమ వివరాలను పొందుపరచాలని, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య నివేదికలను అందించాలన్నారు. మానసిక ఆరోగ్యం, సైబర్ క్రైమ్, డ్రగ్స్ వ్యతిరేకత, పిల్లల పురోగతిపై ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించాలన్నారు.