News November 8, 2025
MBNR: ‘ఈనెల 13లోగా దరఖాస్తు చేసుకోండి’

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గ్రామీణ యువత స్వయం ఉపాధి కోసం SBI RSETY ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ నెల 13 వరకు లేడీస్ టైలరింగ్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఉచిత భోజనం, వసతి కల్పించనున్నారు. 19 నుంచి 45 సం. వయస్సు గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బండమీదిపల్లిలోని RSETY కేంద్రంలో లేదా 9963369361, 9542430607 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
Similar News
News November 8, 2025
తాజా సినీ ముచ్చట్లు!

✏ హీరో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి’ లిరికల్ సాంగ్‌కు 24 గంటల్లో 46మిలియన్ల వ్యూస్ వచ్చాయి. IND సినిమాలో ఒక్కరోజులో అత్యధిక వీక్షణలు సాధించిన సాంగ్ ఇదే.
✏ మహేశ్- రాజమౌళి మూవీ మేకర్స్ ఈనెల 15న జరిగే ‘GlobeTrotter’ ఈవెంట్‌లో 100ft పొడవు & 130ft వెడల్పుతో భారీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కనీవినీ ఎరుగని రీతిలో 3 ని.ల గ్లింప్స్ వీడియో ప్రదర్శిస్తారని టాక్.
News November 8, 2025
జూబ్లీహిల్స్: 3 రోజులు సెలవులు.. 2 రోజులు 144 సెక్షన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ రోజు 11న నియోజకవర్గంలోని Govt, Pvt ఆఫీసులు, స్కూళ్లకు సెలవు ఉంటుంది. 10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన స్కూళ్లలకు సెలవు ప్రకటించారు. 14న కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు ఉంటుందని కలెక్టర్ హరిచందన ప్రకటించారు. అలాగే 10న సా.6 గం. నుంచి 11న సా.6 వరకు, 14న ఉ.6 గం. నుంచి 15న ఉ.6 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ సజ్జనార్ తెలిపారు.
News November 8, 2025
వనపర్తి: నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్పీ

వనపర్తి జిల్లాలో వాహనాల పరిమితికి మించి ప్రయాణించకూడదని ఎస్పీ రావుల గిరిధర్ వాహన చోదకులను హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోగలరని తెలిపారు. పరిమితికి మించి ప్రయాణించి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని సూచించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.


