News November 9, 2025
MBNR: ఈ నెల 13న.. U-14 క్రికెట్ జట్ల ఎంపిక

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో అండర్-14 బాలురకు క్రికెట్ జట్ల ఎంపికలను MDCA స్టేడియంలో (సత్యం కాలనీ పిల్లలమర్రి రోడ్) నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 13న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, వైట్ డ్రెస్ కోడ్, పూర్తి కిట్టుతో హాజరు కావాలన్నారు. క్రీడాకారులు మహబూబ్ నగర్ పీడీ అబ్దుల్లా(90005 74651)కి రిపోర్ట్ చేయాలన్నారు.
Similar News
News November 9, 2025
రెండో అనధికారిక టెస్ట్.. ఇండియా-A ఓటమి

సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో ఇండియా-A ఓడింది. భారత్ నిర్దేశించిన 417 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బవుమా సహా మరో నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. అటు భారత జట్టులో జురెల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదారు. అంతకుముందు తొలి అనధికారిక టెస్టులో IND గెలిచింది. కాగా ఈనెల 14 నుంచి IND, SA మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
News November 9, 2025
మాక్ అసెంబ్లీకి పులివెందుల ఎమ్మెల్యేగా నాగ వైష్ణవి

సింహాద్రిపురం మండలం హిమకుంట్ల పాఠశాల విద్యార్థి డి.నాగ వైష్ణవికి అరుదైన అవకాశం లభించింది. ఈనెల 26న నిర్వహించే మాక్ అసెంబ్లీకి పులివెందుల నియోజకవర్గం నుంచి ఆమె ఎంపికైంది. పాఠశాల, మండలం, నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో వైష్ణవి ఉత్తమ ప్రతిభకనబరిచింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.
News November 9, 2025
లోక్ అదాలత్‌లో 18,000 కేసుల పరిష్కారం: రత్న ప్రసాద్

ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత ఏడాది నవంబర్ 9 నుంచి ఇప్పటి వరకు లోక్ అదాలత్ ద్వారా 18,000 కేసులను రాజీ చేశామని తెలిపారు. గత మూడు నెలల్లో మధ్యవర్తిత్వం ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి 200 కేసులను పరిష్కరించామని స్పష్టం చేశారు. అలాగే, గుర్తించిన 27 మంది అనాథ బాలలకు ఆధార్ కార్డులు ఇచ్చే ప్రక్రియను చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.


