News January 2, 2025
MBNR: ఈ న్యూ ఇయర్ ‘కిక్కే వేరబ్బా’
న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం ఏరులై పారింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి 31వరకు రూ.54.46 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 69,457 కాటన్ల బీర్లు, 52,630 కాటన్ల ఐఎంఎల్ లిక్కర్ విక్రయాలున్నాయి. దీంతో అబ్కారీశాఖకు భారీ ఆదాయం వచ్చింది. ఈ న్యూ ఇయర్ నేపథ్యంలో పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో Dec 31న MBNRలో 93, WNPలో 55, GWLలో 31, NRPTలో 22, NGKLలో 6 కేసులు నమోదు చేశారు.
Similar News
News February 5, 2025
బాలానగర్: ఉరేసుకుని యువకుడి సూసైడ్
ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలనగర్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ యాదవ్ (23) హైదరాబాదులో ఉంటూ వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఏం జరిగిందో కారణం తెలియదు కానీ.. తల్లి కూలీ పనులకు వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News February 5, 2025
NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి
ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన NGKL మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
News February 5, 2025
MBNR: వివాహితపై లైంగిక దాడి
MBNR జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఓ తండాకు చెందిన వివాహితపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గిరిజనతండాకు చెందిన వివాహిత పొలానికెళ్లి వస్తుండగా.. శంకర్‌నాయక్ ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.