News March 19, 2026
MBNR: ఉగాది, రంజాన్ EFFECT.. రద్దీ

ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ వైపు వచ్చే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. గురువారం ఉగాది, శనివారం రంజాన్ కావడంతో మధ్యలో శుక్రవారం సెలవు తీసుకుని ఊర్లకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏర్పడింది.
Similar News
News March 26, 2026
సబ్సిటీ రుణాలను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

ఎస్సీ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద రూ.లక్ష లోపు రుణాలపై 90% సబ్సిడీ, రూ.3లక్షల లోపు రుణాలకు 70 శాతం సబ్సిడీ, రూ.3లక్షల నుంచి రూ.7లక్షల లోపు రుణాలకు 60 శాతం సబ్సిడీ ఇస్తున్నట్టు ఆమె వెల్లడించారు.
News March 26, 2026
బాలానగర్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాల్లో 5 రోజులుగా విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. పగలంతా అధిక ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. సాయంత్రం ఏదో ఒకచోట ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గడిచిన 24 గంటల్లో బాలానగర్ మండల కేంద్రంలో 23.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాజాపూర్ 3.0, మిడ్జిల్ మండలం దోనూరు 0.25 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది.
News March 26, 2026
MBNR: ‘173 సిలిండర్లు స్వాధీనం..121 కేసులు నమోదు’

గృహ అవసరాలకు ఇచ్చే సబ్సిడీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టవిరుద్ధమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ హెచ్చరించారు. గత 15రోజులుగా జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేశామన్నారు. ఈ తనిఖీల్లో వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న మొత్తం 173 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 121 కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.


