News June 10, 2024
MBNR: ఉత్కంఠ పోరులో గెలిచినా.. మంత్రి పదవి దక్కలే !
MBNR ఎంపీగా ఉత్కంఠ పోరులో గెలిచిన డీకే అరుణకు కేంద్ర పదవి దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. MBNR లోక్ సభ పరిధిలో 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అందరు కాంగ్రెస్ MLAలే ఉండి, సీఎం సొంత జిల్లాలో ఆ అభ్యర్థిపై తలపడి ఉత్కంఠ పోరులో 4500 ఓట్ల మెజార్టీతో అరుణ గెలవడంతోపాటు సీనియర్ నాయకురాలు కావడంతో మంత్రి పదవి దక్కుతుందని భావించినా, రాకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News October 4, 2024
ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నవ రాత్రులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఇంట్లోనే కాక, వీధుల్లో ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారు నవరాత్రుల మొదటి రోజున దుర్గామాత శైలపుత్రిగా దర్శనిమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా కట్టుపొంగలి, చవివిడి,వడపప్పు ప్రసాదంగా పెడతారు. 6వ రోజున వేడుకలు, పూజలు ప్రారంభమవుతాయి. తరువాతి మూడు రోజులలో దుర్గ, లక్ష్మి, సరస్వతి వివిధ రూపాలలో పూజిస్తారు.
News October 3, 2024
వనపర్తి: ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్
వనపర్తి జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరంగాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రాకేష్ హైదరాబాద్ గణేష్ బందోబస్తుకు వెళ్లి విధుల్లో చేరకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం సీసీఏ రూల్స్‌కు విరుద్ధమని సస్పెండ్ చేశారు. పానగల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన రామకృష్ణ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరుతో సస్పెండ్ చేశారు.
News October 3, 2024
WNP: 21 నుంచి CM కప్ పోటీలు: శివసేనారెడ్డి
ఈ నెల 21 నుంచి ప్రతి గ్రామంలో గ్రామస్థాయి CM కప్ పోటీలు ప్రారంభిస్తామని సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి వెల్లడించారు. ఈనెల 21 నుంచి ఆరు అథ్లెటిక్స్ విభాగాల పోటీలను, ఖోఖో, వాలీబాల్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. 21 నుంచి 24 వరకు గ్రామీణ స్థాయి పోటీలు, 24 నుంచి 30 వరకు మండల స్థాయి పోటీలు, NOV 8 నుంచి 13 వరకు జిల్లా స్థాయి పోటీలు ఉంటాయన్నారు. NOV 28 నుంచి DEC 5వరకు రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు.