News March 8, 2025
MBNR: ఉపాధి పనుల ద్వారా ఆర్థికంగా రాణించాలి: కలెక్టర్

మహిళలు స్వయం ఉపాధి పనుల ద్వారా ఆర్థికంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలు తయారుచేసిన వస్తువుల్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఇలాంటి పనుల్లో ప్రతి ఒక్కరు రాణించేందుకు కృషి చేయాలన్నారు.
Similar News
News April 22, 2025
మహనీయుల చరిత్రను అధ్యయనం చేయాలి: ఉపకులపతి

పాలమూరు యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ & బీసీ సెల్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్ హాజరై, మాట్లాడారు. వారి జీవితం, ఆచరణ, సేవలు, దేశం కోసం చేసిన త్యాగాలు మనందరికీ ప్రేరణగా నిలిచాయని, ఈ మహానీయుల జీవిత చరిత్ర మనకు ఎన్నో విషయాలు నేర్పుతుందని అన్నారు. ఎస్పీ D. జానకి, యూనివర్సిటీ అధ్యాపకులు అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
News April 22, 2025
MBNR: రైతులు అధైర్య పడొద్దు: కలెక్టర్

అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దని కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. అడ్డాకులలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఆదివారం కురిసిన వర్షానికి కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు.
News April 22, 2025
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

MBNR ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన 92 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని అధికారులను అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం ఫిర్యాదులను ఆ వారమే పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.