News September 8, 2024
MBNR: ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం..!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. కాలువలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులకు ఆదేశించారు. శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమై రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురుస్తుండటంతో వాగులు, కాలువలు నిండి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు.
Similar News
News February 6, 2026
పాలమూరు జిల్లాలో ఈనాటి ముఖ్య వార్తలు

✒ పరీక్షల షెడ్యూల్ విడుదల
✒ డిగ్రీ రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
✒ పుట్ట గొడుగు తయారీలో ఉచిత శిక్షణ
✒ పాలమూరుకు సీఎం వలస వచ్చారు: డీకే అరుణ
✒ ఫైనల్‌కు చేరిన పాలమూరు జట్టు
✒ పాలమూరు మున్సిపల్‌లో త్రిముఖ పోరు
✒ ఎన్నికల తర్వాత జిల్లాను రద్దు చేస్తారు: రాజేందర్ రెడ్డి
✒ పాలమూరు: బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్
News February 6, 2026
MBNR: రైతులు ALERT..యూరియా ఉంది!

మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు 63,430 మంది రైతులు 25,675 యూరియా బస్తాలను బుక్ చేసుకొని కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ వెల్లడించారు. 11,892 యూరియా బస్తాలు ఇంకను రైతులకు బుక్ చేసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉన్నాయని, రైతు తనకు అందుబాటులో ఉన్న మండలం, డీలర్‌ను ఎంచుకుని బుకింగ్ చేసుకోవాలని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదన్నారు.
News February 6, 2026
MBNR: పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్

పాలమూరు యూనివర్సిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్–I,II, పోలీస్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ డా మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ తరగతులు పీజీ కళాశాల సెమినార్ హాల్‌లో ఉదయం 6.30–8.30, సాయంత్రం 5.00–8.00 గంటల వరకు ఉంటాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 6న సాయంత్రం 5.00 గంటలకు హాజరుకావాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.భూమయ్య పేర్కొన్నారు.


