News May 19, 2024

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా సోలిపూర్‌లో 41.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 36.5 మి.మీ, గద్వాల జిల్లా సాటేర్లలో 29.5 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా ఉరవకొండలో 22.0 మి.మీ, నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Similar News

News February 16, 2026

MBNR: U-17 క్రికెట్ టోర్నీ విజేతగా మహబూబ్‌నగర్

image

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్-17 క్రికెట్ బాలుర టోర్నమెంట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి పది జట్లు పాల్గొనగా.. మొదటి స్థానంలో మహబూబ్‌నగర్, రెండో స్థానంలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. గెలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంఈఓ మంజులాదేవి, SGF సెక్రటరీ ఆర్.శారదాబాయి, స్థానిక నేతలు, పీడీలు పాల్గొన్నారు.

News February 16, 2026

MBNR: ఎవరూ అరెస్టు కాలేదు: ఎమ్మెల్యే

image

ఎవరూ అరెస్టు కాలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో అసత్య ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ తనతోనే బస్సులో ఉన్నారని, ఎటువంటి అరెస్టు జరగలేదని ఆయన స్పష్టతనిచ్చారు.

News February 16, 2026

పాలమూరు: నేడు ‘ప్రజావాణి’ రద్దు.. కారణం ఇదే!

image

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో నేడు జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి ప్రకటించారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక అనంతరం తిరిగి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని, ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు.