News February 19, 2025
MBNR: ఎముక గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

పెళ్లిలో భోజనం చేస్తుండగా.. ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్ మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. MBNR మండలం దొడ్డలోనిపల్లికి చెందిన జహంగీర్(49) తిర్మలాయకుంటతండాలో ఓ పెళ్లికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. గొంతులో ఎముక ఇరుక్కుని కిందపడిపోయాడు. అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 21, 2025
MBNR: నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన.. రూ.5 లక్షల సబ్సిడీ

సీఎం రేవంత్ నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సర్కారు తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. బేస్‌మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.
News February 21, 2025
MBNR: ఆహార భద్రతపై దృష్టి: రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్

జిల్లాలో ఆహార భద్రత పట్ల పకడ్బందీగా దృష్టి సారిస్తున్నారని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల తనిఖీ అనంతరం కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరుని పరిశీలించారు. ఆహార భద్రత పకడ్బందీగా కొనసాగుతుందని అధికారులను అభినందించారు.
News February 20, 2025
MBNR: సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎంపీ

హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్టీ మోర్చ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంత్ సేవాలాల్ భోగ్ బండార్ హోమం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల ఆరాధ్య దైవం, హిందూ ధర్మ పరిరక్షకుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని అన్నారు. సేవాలాల్ జయంతిని ఫిబ్రవరి 15న దేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని పార్లమెంట్లో తెలిపినట్లు చెప్పారు.