News March 26, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు..

image

MLC ఉప ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,439 మంది MPTCలు, ZPTCలు, మున్సిపల్ కౌన్సిలర్లు, MLAలు, MLCలు, MPలు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. 850 మందికి పైగా ఓటర్లు BRSకు సంబంధించిన వారు ఉండగా, 350 మంది కాంగ్రెస్ పార్టీ, 50 మంది BJP, మిగతా ఇతర పార్టీలు, స్వతంత్రులు ఉన్నారు. రాష్ట్రంలో అధికార మార్పు జరగడంతో BRS ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.

Similar News

News January 9, 2025

MBNR: మద్దిమడుగు ఆంజన్న రూ.14 కోట్ల ఆస్తిపరుడు

image

మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలో ప్రసిద్ధిగాంచిన మద్దిమడుగు ఆంజనేయ స్వామి రూ.14 కోట్లకు ఆస్తిపరుడు. భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన సొమ్మును దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకులో జమ చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.14 కోట్లు దేవుడి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉన్నట్లు ఈవో రంగాచారి వెల్లడించారు. ఆ మొత్తానికి వచ్చిన వడ్డీని సైతం బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా చేస్తున్నామని తెలిపారు. 

News January 9, 2025

అమరచింత: జూరాల ప్రాజెక్టు నేటి నీటి సమాచారం

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నేటి సమాచారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.225 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆవిరి ద్వారా 83 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 400, మొత్తం అవుట్‌ఫ్లో 1,481 క్యూసెక్కులను వదులుతున్నట్లు తెలిపారు.

News January 9, 2025

MBNR: 11న కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షణ

image

పేదల తిరుపతిగా ప్రసిద్దిగాంచిన ఉమ్మడి MBNR జిల్లాలోని కురుమూర్తి స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీన గిరి ప్రదక్షణ ప్రారంభం కానుంది. అయోధ్యలో బాలరాముడి విగ్రహా ప్రతిష్ట జరిగి ఆరోజుకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.