News April 8, 2025

MBNR: ఎరుకల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

image

ఎరుకల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిని కలిసి ఎరుకల సంఘం సభ్యులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్సరి కృష్ణయ్య మాట్లాడుతూ.. పేద ఎరుకలకు విద్య, వైద్యం, సీసీ రోడ్లు, ఉపాధి, మౌలిక వసతులు కల్పించి వారి సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు. పందుల పెంపకం దారులకు ప్రత్యామ్నాయ ఉపాధి, గిరిజన రుణాలు, రుణమాఫీ, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నారు.

Similar News

News April 8, 2025

అడ్డాకుల: శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే..?

image

దక్షిణ కాశీగా పిలవబడే అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దేవాలయ శాఖ ఇన్‌స్పెక్టర్ వీణాద్రి ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు. లెక్కింపులో భాగంగా రూ.5,13,368 సమకూరినట్టు ఆలయ ఈవో రాజేశ్వర శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు నాగిరెడ్డి, రవీందర్ శర్మ, దామోదర్ రెడ్డి, శ్రీహరి, నరేందర్ చారి, కొత్త కృష్ణయ్య పాల్గొన్నారు.

News April 8, 2025

మహబూబ్‌నగర్‌లో CONGRESS VS BRS

image

పాలమూరు పరిధి GDWL, NGKL, NRPT, WNP, MBNR జిల్లాల్లో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRSనేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRSనేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?

News April 8, 2025

పాలమూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

image

పాలమూరు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 58మంజూరు పోస్టులకు గాను 16 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 42ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

error: Content is protected !!