News November 13, 2025

MBNR: ఎస్సీ విద్యార్థులకు అకౌంట్లోనే డబ్బులు జమ

image

ఎస్సీ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి స్కాలర్షిప్లు డబ్బులు తమ అకౌంట్‌లోనే జమ అవుతాయని డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ ఆడిటోరియంలో యూనివర్సిటీ విద్యార్థులకు సమావేశం నిర్వహించారు. పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ నాగం కుమారస్వామి పాల్గొన్నారు.

Similar News

News November 13, 2025

అలంపూర్: వే2 న్యూస్ ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు

image

అలంపూర్ సమీపంలోని గొందిమల్ల కృష్ణా నది వద్ద ప్రభుత్వ నిషేధిత అలవి వలలతో గుట్టుగా చేపలు పడుతున్న ఇద్దరు వ్యక్తులపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. చేపల మాఫియా పంజా.. మత్స్యకారుల ఆవేదన అనే శీర్షికన <<18273550>>Way2Newsలో<<>> కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా మత్స్యశాఖ అధికారిణి షకీలా భాను, MRO మంజుల, ఎస్ఐ వెంకటస్వామి అక్కడికి చేరుకుని వలలను గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 13, 2025

నక్కపల్లిలో వెయ్యి ఎకరాల్లో టాయ్ పార్క్

image

నక్కపల్లి మండలంలోని కారిడార్ భూముల్లో మహిళలకు ఉపాధినిచ్చే టాయ్ పార్కు ఏర్పాటు కానుంది. చైనా తరహాలో ఎకో సిస్టంతో బొమ్మలను తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఒక విదేశీ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, కలెక్టర్ విజయ్ కృష్ణన్‌తో హోంమంత్రి అనిత చర్చించారు.

News November 13, 2025

జనగామ: దందా ఎంపీవోలు.. భగ్గుమంటున్న కార్యదర్శులు..!

image

జనగామ జిల్లాలోని పలువురు మండల పంచాయతీ అధికారులు(ఎంపీవో) దందాలకు పాల్పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల నుంచి వసూళ్లకు పాల్పడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రోహిబిషన్ ఫైల్స్, చేసిన పనులకు చెక్కులు జారీ చేసేందుకు చేతులు చాస్తున్నారు. గ్రామాల సందర్శనకు వచ్చినందుకు సైతం వారి వ్యక్తిగత కార్లలో పెట్రోల్‌కు సైతం పైసలు వసూల్ చేస్తున్న ఎంపీవోలపై కార్యదర్శులు భగ్గుమంటున్నారు.