News July 16, 2024

MBNR: ఏకరూప దుస్తులకు రూ. 1.31 కోట్ల నిధులు విడుదల

image

2024-25 విద్యా సంవత్సరంలో ఏకరూప దుస్తులు సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2,998 పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఒక జత ఏకరూప దుస్తులు అందజేసేందుకు కుట్టు కూలీ కోసం రూ. 1 31 కోట్ల నిధులు విడుదల అయ్యాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒక్కో జతకు రూ. 50 వంతున స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేయనున్నారు.

Similar News

News October 2, 2024

పాన్‌గల్: క్షుద్ర పూజలు కలకలం.. గ్రామస్థుల్లో టెన్షన్..

image

పాన్‌గల్ మండలం కేతేపల్లి గ్రామంలోని గుండ్ల చెరువు‌కు వెళ్లే దారిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, తెల్లని పిండితో మనిషిని పోలిన బొమ్మను గీశారని గ్రామస్థులు తెలిపారు. దారి నుంచి పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. రాతియుగం నుంచి రాకెట్ యుగం వచ్చినా ఇలాంటి క్షుద్రపూజలు ఏంటని పలువురు అంటున్నారు.

News October 2, 2024

నాగర్ కర్నూల్‌ను నాశనంచేస్తున్న తండ్రి, కొడుకు:మర్రి జనార్దన్ రెడ్డి

image

సగం తెలిసిన MLC, అనుభవం లేని MLA నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. MLC దామోదర్ రెడ్డి, MLA రాజేష్ రెడ్డిలను ఉద్దేశించి విమర్శించారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చి తనకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలని మాజీ ఎమ్మెల్యే వారికి సవాల్ విసిరారు.

News October 1, 2024

NGKL: డీఎస్సీ ఫలితాల్లో రెండు జిల్లాల్లో డిస్ట్రిక్ టాపర్

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని నిరుపేద కుటుంబానికి చెందిన కే. స్వప్న తాజా డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటింది. SGT తెలుగులో 84.90 మార్కులు సాధించి నాగర్ కర్నూల్ జిల్లా స్థాయిలో 1st ర్యాంక్ సాధించింది. అలాగే SGT ఇంగ్లిష్‌లో 87.90 మార్కులు సాధించి హైదరాబాద్ జిల్లా స్థాయిలో 1st ర్యాంక్ సాధించింది. ఫలితాల్లో స్వప్న సత్తా చాటడంతో సన్నిహితులు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.