News April 10, 2025
MBNR: ఏప్రిల్ 12 నుంచి 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న డా.బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ థర్డ్ ఇయర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులకు 5వ సెమిస్టర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభమై 19వ తేదీ వరకు జరుగుతాయని MVS కళాశాల ప్రిన్సిపల్ డా.Dk.పద్మావతి, రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలని సూచించారు.
Similar News
News July 6, 2025
ఈనెల 10 లోపు శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత

ఈనెల 10 తేదీలోపు శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. రేపటి నుంచి డ్యాం ఇంజినీరింగ్ అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఏ క్షణంలో అయినా డ్యామ్ గేట్లను తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News July 6, 2025
SKLM: వ్యాధులు పట్ల అప్రమత్తం అవసరం

పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు పట్ల అప్రమత్తతో మెలగాలని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజగోపాలరావు అన్నారు. నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని శ్రీకాకుళం వెటర్నరీ పోలీ క్లినిక్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంపుడు జంతువుల నుంచి ర్యాబిస్, స్వైన్ ఫ్లూ, యంత్రాక్స్, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు సంక్రమిస్తాయన్నారు.
News July 6, 2025
రైతులకు అవగాహన కల్పించండి: కడప కలెక్టర్

కడప జిల్లాలో ఈనెల 14వ తేదీ వరకు జరిగే పశుగ్రాస వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. పశుగ్రాస వారోత్సవాల గోడపత్రికలను ఆయన కడపలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పశుగ్రాసాలను సాగు చేసి రైతుల ఇంట సిరుల పండించేలా చూడాలన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పశుగ్రాసాల సాగు ఎంతో ఉపయోగకరమని ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.