News December 21, 2025

MBNR: ఒకే కుటుంబం.. ముగ్గురు సర్పంచ్‌లు.!

image

ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లి ముగ్గురు సర్పంచ్‌లుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. మహేశ్వరంలోని గంగారం తండాకు మునావత్ దేవేందర్ సర్పంచ్ కాగా, NGKLజిల్లా ఉప్పునుంతల మండలం దేవాదారికుంటకు మంగమ్మ రతన్‌సింగ్, NLGజిల్లా డిండి మండలం పడమటి తండాకు దివ్యశంకర్ సర్పంచ్‌లుగా సేవలందిస్తున్నారు. వేర్వేరు జిల్లాల్లో స్థిరపడ్డ ఈ ముగ్గురూ సర్పంచ్‌లు కావడంతో హాట్ టాపిక్‌గా మారింది.

Similar News

News December 24, 2025

హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>విశాఖపట్నంలోని<<>> హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ 11 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ , డిగ్రీ/పీజీ , LLB/LLM, ICAI/ICWAI, MBA, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు ఫీజు లేదు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://hslvizag.in

News December 24, 2025

అంతా తానై మనల్ని రక్షిస్తున్న ‘విష్ణుమూర్తి’

image

అగ్రణీర్గ్రామణీః శ్రీమాన్న్యాయో నేతా సమీరణః|
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షస్సహస్రపాత్||
సృష్టిలో అందరికంటే ముందుండేవాడు, జీవులను సత్మార్గంలో నడిపించేవాడు, సమస్త ఐశ్వర్యాలకు అధిపతి ‘విష్ణుమూర్తి’. ఆయన నాయకుడే కాదు, న్యాయ స్వరూపుడై లోకాన్ని శాసిస్తాడు. విశ్వమంతా నిండిన ఆ ఆత్మ స్వరూపుడికి వేయి శిరస్సులు, వేయి కన్నులు, వేయి పాదములు ఉంటాయి. అంతటా తానై ఉండి మనల్ని రక్షిస్తుంటాడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News December 24, 2025

ఏజెన్సీ ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు

image

AP: ఏజెన్సీలోని ఆసుపత్రులకు మందులు తదితరాలను ఇకనుంచి డ్రోన్ల ద్వారా అందించనున్నారు. ఈమేరకు ‘రెడ్ వింగ్’ అనే సంస్థతో వైద్యారోగ్యశాఖ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఈ సంస్థ అరుణాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి సేవలు అందిస్తోంది. పాడేరు కేంద్రంగా 80 KM పరిధిలోని ఆసుపత్రులకు ఈ సంస్థ డ్రోన్లతో మందులు అందిస్తుంది. డ్రోన్లు తిరిగి వచ్చేటపుడు రోగుల రక్త, మల, మూత్ర నమూనాలను తీసుకువస్తాయని కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు.