News March 7, 2025
MBNR: ఒక్కరోజులో 200కు పైగా దరఖాస్తులు

ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించుకున్న వారికి ప్రభుత్వం 25% రాయితీ ప్రకటించడంతో మున్సిపల్ కార్యాలయానికి దరఖాస్తుదారులు పోటెత్తారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చేస్తున్న విస్తృతప్రచారానికి తగ్గట్టుగానే దరఖాస్తుదారులు ముందుకు వస్తున్నారు. గురువారం ఒక్కరోజు 200కు పైగా దరఖాస్తుదారులు పరిష్కరించుకొనేందుకు ముందుకొచ్చారు. ఇప్పటివరకు 2వేలమందికి పైగా ముందుకు వచ్చినట్లు సమాచారం.
Similar News
News March 7, 2025
MBNR: 25% రాయితీ పొందండి: స్పెషల్ కలెక్టర్

ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించుకొని ప్రభుత్వం కల్పించిన 25% శాతం రాయితీని పొందాల్సిందిగా స్పెషల్ కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి శివేంద్ర ప్రతాప్ విజ్ఞప్తి చేశారు. గురువారం మున్సిపల్ లో చేసిన ఎల్ఆర్ఎస్ హెల్ప్ లైన్ సెంటర్లను ఆయన పరిశీలించారు. పరిశీలించారు హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించి తమ దరఖాస్తులను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు.
News March 7, 2025
గౌతాపూర్ మాజీ సర్పంచ్ మృతి

బాలానగర్ మండలంలోని గౌతాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మల్లెకేడి యాదగిరిజీ అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. ఈయన 2009-2014 వరకు గ్రామ సర్పంచిగా పనిచేశాడు. అనంతరం బీఆర్ఎస్‌లో చేరి.. 2014 ఆగస్టులో ఎంపీటీసీగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివిధ పార్టీల చెందిన నాయకులు సంతాపం తెలిపారు.
News March 7, 2025
MBNR: నేడు ఘనంగా మహిళా దినోత్సవం: కలెక్టర్

ఈనెల 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఒక ప్రకటన తెలిపారు. ముఖ్య అతిథులుగా ఎంపీటీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలతోపాటు మూఢా ఛైర్మన్ లక్ష్మణ యాదవులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.