News December 1, 2025

MBNR: ఓపెన్ డిగ్రీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల

image

MBNR డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షల ఫీజును డిసెంబర్ 27లోగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ చెప్పారు. ఈ పరీక్షలు 2026 ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు జరుగుతాయని తెలిపారు. పూర్తి వివరాలకు 73829 29609ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Similar News

News December 3, 2025

PCOSతో దంత సమస్యలు

image

పీసీఓఎస్‌ సమస్య పెరిగినప్పుడు ‘పెరియోడాన్‌టైటిస్‌’ అనే చిగుళ్ల సమస్య కూడా వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలు వదులవుతాయంటున్నారు. PCOS వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో చిగుళ్లలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి వైద్యులను సంప్రదిస్తే తగిన మందులతో పాటు ఆహారపుటలవాట్లలో కూడా మార్పులు-చేర్పులు సూచిస్తారని చెబుతున్నారు.

News December 3, 2025

సంగారెడ్డి: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్‌గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట, సిర్గాపూర్, న్యాల్కల్ మండలాల్లోని 234 సర్పంచ్, 1,960 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు

News December 3, 2025

ఖమ్మం: ఆలస్యం, సెలవులపై వేటు.. టీచర్లకు WARNING

image

ఎఫ్‌ఆర్‌ఎస్ (ముఖ గుర్తింపు హాజరు) ఉన్నప్పటికీ విధులకు ఆలస్యంగా రావడం, ముందుగా వెళ్లిపోతున్న ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ముఖ్యంగా, 6 నెలలు సెలవు తీసుకుని విదేశాల నుంచి దీర్ఘకాలికంగా విధులకు రాని టీచర్ల వివరాలను సేకరించి, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అవసరమైతే వారిని ఉద్యోగం నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.