News November 14, 2024

MBNR: ఓపెన్ డిగ్రీ, PGలో చేరేందుకు రేపే లాస్ట్

image

డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 15 వరకు అవకాశం ఉందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వర్సిటీలో చేరిన ద్వితీయ,తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, అంతకు ముందు వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం నవంబరు 15లోగా ట్యూషన్ ఫీజును www.braou.ac.in ఆన్‌లైన్‌లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 21, 2024

NRPT: మాగునూర్ ఘటన.. అధికారులపై సస్పెన్షన్ వేటు

image

మాగునూర్ ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించగా ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. హెచ్‌ఎం మురళీధర్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం బాపురెడ్డి ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కాంట్రాక్టును రద్దు చేశారు. బుధవారం (నిన్న) మధ్యాహ్న భోజనం వికటించి మాగనూర్ జడ్పీ పాఠశాలలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

News November 21, 2024

MBNR: విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్

image

ఫుడ్ పాయిజన్‌కు గురై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాగనూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఎటువంటి ఆందోళనకు గురి కాకూడదని ధైర్యం చెప్పారు. విద్యార్థులకు సరైన ఆహారం, వైద్యం అందించాల్సిందిగా సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

News November 21, 2024

కృష్ణ: తంగడి కుంటలో మొసలి కలకలం

image

కృష్ణ మండలం పరిధిలోని తంగిడి కుంటలో బుధవారం మొసలి కలకలం రేపింది. గ్రామ కార్యదర్శి వీరేష్ వెళ్తుండగా మొసలి కనిపించిందని తెలిపారు. మొసలి ఉన్నట్లు గ్రామ ప్రజలకు సమాచారం అందించారు. అటువైపు వెళ్ళవద్దని మత్స్యకారులు, పశువుల కాపరులు కుంటలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.