News October 10, 2025
MBNR: ఓపెన్ SSC, INTER గడువు పొడిగింపు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 13లోగా (ఫైన్ లేకుండా) ఈనెల 23లోపు (ఫైన్‌తో) అప్లె చేసుకోవచ్చని, www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, చదువు మానేసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#SHARE IT.
Similar News
News October 10, 2025
జనగామ: టీహెచ్ఆర్ నమోదులో అష్టకష్టాలు

జనగామ జిల్లాలోని అంగన్వాడీ, పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు అందించే రేషన్(టీహెచ్ఆర్)లో కేంద్రాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. టీహెచ్ఆర్ యాప్‌లో పిల్లల తల్లిదండ్రుల ఫొటో క్యాప్చర్ నమోదులో అష్టకష్టాలు పడుతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News October 10, 2025
వడ్డేమాన్‌లో.. అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్‌లో 81.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యింది. నవాబుపేట 70, దేవరకద్ర 37.5, కౌకుంట్ల 31.3, చిన్నచింతకుంట 30.5, మూసాపేట మండలం జానంపేట 29.3, అడ్డాకుల 16.5, కోయిలకొండ మండలం పారుపల్లి 4.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
News October 10, 2025
అలంపూర్: జీతాలు రాక ఇబ్బందుల్లో 1962 సిబ్బంది

సంచార పశు వాహనాల ద్వారా సేవలందిస్తున్న 1962 సిబ్బందికి మూడు నెలల నుంచి జీతాలు రాక సమస్యల వలయంలో చిక్కుకున్నారు. దీంతో తమ కుటుంబ పోషణ భారమైందని, పూట గడవడం కష్టమైందని వాపోతున్నారు. ఒక వాహనానికి 4 మంది సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ బాధలు అర్థం చేసుకొని వెంటనే జీతాలు విడుదల చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు.