News January 15, 2026
MBNR: ఓపెన్ SSC, INTER.. రేపే లాస్ట్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓపెన్ SSC, INTERలో చేరిన విద్యార్థులు ఎగ్జామ్ ఫీ చెల్లించాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఈ నెల 16లోగా (ఫైన్‌తో) ఎగ్జామ్ ఫీ ఆన్లైన్‌లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్‌లో సందర్శించాలన్నారు.
#SHARE IT
Similar News
News January 18, 2026
ఎన్టీఆర్, YSR సెంటిమెంటుతో రేవంత్ వ్యూహం!

TG: ఖమ్మం పాలేరులో జరిగిన సభలో CM రేవంత్ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. NTR స్ఫూర్తితో సన్నబియ్యం, YSR స్ఫూర్తితోనే ఉచిత కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ దివంగత నేతలకు ఖమ్మంలో ఫాలోయింగ్ ఎక్కువనే సంగతి తెలిసిందే. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో BRSను ఓడించేందుకు CM వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
News January 18, 2026
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ రమణ

జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆదివారం జగిత్యాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎనిమిది మంది లబ్ధిదారులకు రెండు లక్షల రూపాయల విలువ చేసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎల్ రమణ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
News January 18, 2026
రుక్మిణీ వసంత్ డేటింగ్?.. క్లారిటీ!

‘కాంతార-2’ భామ రుక్మిణీ వసంత్ ఫొటో SMలో వైరలవుతోంది. ఓ వ్యక్తితో ఆమె క్లోజ్‌గా ఉండటంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఫొటోలో ఉన్న వ్యక్తి సిద్ధాంత్ నాగ్ కాగా, అతనొక ఫొటోగ్రాఫర్ అని సమాచారం. వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. ఇది 2023లో దిగిన ఫొటో కాగా తాజాగా వైరలవ్వడం గమనార్హం. ప్రస్తుతం రుక్మిణి ఎన్టీఆర్-నీల్, టాక్సిక్ మూవీల్లో నటిస్తున్నారు.


