News October 17, 2024

MBNR: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి: కలెక్టర్

image

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమలకు టీజీ. ఐ పాస్ కింద వివిధ శాఖల ద్వారా మంజూరు చేయాల్సిన అనుమతులను సమీక్షించి నిర్ణిత గడువులోగా జారీ చేయాలన్నారు.

Similar News

News October 17, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎల్లో అలెర్ట్ ⚠️

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా పంట పొలాలకు వెళ్లే రైతులు విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు.

News October 16, 2024

MBNR: ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు పొడిగింపు

image

డాక్టర్ BR అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులకు ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ సుధారాణి తెలిపారు. 2022-23, 2023-24 డిగ్రీలో చేరిన 2వ, 3వ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును చెల్లించాలని, సకాలంలో ఫీజు చెల్లించని వారు 30లోపు చెల్లించాలని తెలిపారు. braouonline వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంటాయన్నారు.

News October 16, 2024

అడ్డాకుల: అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

image

అడ్డాకుల మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు సందర్శించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టులపై మంచి పట్టు సాధించాలన్నారు.