News March 27, 2025

MBNR: కమీషన్ల ముంపులో కూరుకుపోయింది: ఆర్ఎస్పీ

image

‘మా SC- సబ్ ప్లాన్ నిధులు (రూ.35,000 కోట్లు) ఎక్కడికి వెళ్తున్నాయి?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల ముంపులో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన అత్యుత్తమ విద్యార్థి ఒకరు రాసిన లేఖను దయచేసి చదవండి అంటూ కోరారు.

Similar News

News September 18, 2025

ఆసిఫాబాద్‌లో మహిళ అదృశ్యం.. కేసు నమోదు

image

ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్‌కు చెందిన జంగంపల్లి పద్మ(32) అనే మహిళ అదృశ్యమైనట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఈరోజు తెలిపారు. ఈనెల 15న తన పుట్టింటికి వెళతానని భర్త రాజేశ్వర్‌కు చెప్పి వెళ్లిందని, కానీ ఆమె పుట్టింటికి కూడా వెళ్లలేదన్నారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 18, 2025

HYD: ఆచార్య ఎస్వీ రామారావు నిర్యాణం పట్ల తెలుగు వర్సిటీ సంతాపం

image

తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణంపై దృష్టి పెట్టి పరిశోధన చేసిన గొప్ప సాహితీ వేత్త సూగూరు వేంకటరామారావు అని, వారి నిర్యాణం పట్ల తెలుగు విశ్వవిద్యాలయం ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. OU తెలుగు శాఖ పూర్వాచార్యులుగా, కేంద్రీయ విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, బెనారస్, బెంగళూరు విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారని, ఎస్వీ రామారావు మృతిపట్ల వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు.

News September 18, 2025

VKB: క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి: VC

image

తెలుగు వర్శిటీలోని బాచుపల్లి ప్రాంగణంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో పలు విభాగాలలో అధ్యాపకులకు అధ్యాపకేతురులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్యఅతిథిగా ఉపకులపతి(VC) ఆచార్య నిత్యానందరావు హాజరై ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తిని చాటడం ద్వారా భావోద్వేగాలని ఎలా నియంత్రించుకోవాలో తెలుస్తుందన్నారు. స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఆర్.గోపాల్, వర్శిటీ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.