News October 30, 2025
MBNR: కరెంట్ స్తంభం గుంతలో పడి బాలుడి మృతి

గుంతలో పడి బాలుడు మృతిచెందిన విషాదకర ఘటన మిడ్జిల్ మండలంలో జరిగింది. బోయినపల్లికి చెందిన పిట్టల రామకృష్ణ, లక్ష్మమ్మ దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ(3) ఇంటి ముందు విద్యుత్ స్తంభం కోసం తీసిన నీటి గుంతలో పడి మరణించాడు. ఆడుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ప్రమాదవశాత్తు అందులో పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 30, 2025
BREAKING: తుఫాన్ ఎఫెక్ట్.. HYD శివారులో మహిళ మృతి

మొంథా తుఫాను కారణంగా HYD శివారులో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. మజీద్‌పూర్-బాటసింగారం మధ్య వాగు ఉద్ధృత రూపం దాల్చింది. అటుగా వచ్చిన దంపతులు వరదలో కొట్టుకుపోయారు. గమనించిన యువకులు భర్తను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. మహిళ నీటిలో గల్లంతై చనిపోయింది. మృతురాలు నెర్రపల్లికి చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. పుట్టింటి నుంచి భువనగిరికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 30, 2025
టెస్టుల్లో కొత్త సంప్రదాయం.. ఇక రెండు టీ బ్రేకులు!

టెస్టుల్లో సరికొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్ నుంచి 2 టీ బ్రేక్స్ అమలు కానున్నాయని తెలుస్తోంది. ఫస్ట్ సెషన్ 9-11am, సెకండ్ సెషన్ 11-20am-1.20pm, మూడో సెషన్ 2-4pmగా ఉండనుందని క్రీడా వర్గాలు తెలిపాయి. లంచ్‌కు ముందు ఒకటి, తర్వాత మరో టీ బ్రేక్ అమల్లోకి రానుందని వెల్లడించాయి. ప్రస్తుతం లంచ్ తర్వాత మాత్రమే టీ బ్రేక్ ఉన్న సంగతి తెలిసిందే.
News October 30, 2025
NLG: ధాన్యం తడవడంతో సెంటర్ ఇన్‌ఛార్జికి షోకాజ్

తిప్పర్తి మార్కెట్ యార్డ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల తుఫాను వర్షాలకు కేంద్రంలోని ధాన్యం తడవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకుగాను సెంటర్ ఇన్‌ఛార్జికి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆమె ఆదేశించారు.


