News March 21, 2024

MBNR: కారు, బైక్ ఢీ.. కాంగ్రెస్ నేత మృతి

image

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డకల్ మండల బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికుల సమాచారం.. బైపాస్ వద్ద రోడ్డు దాటుతున్న కాంగ్రెస్ నేత వెంకట్ రెడ్డి బైక్‌పై కారు ఢీకొట్టింది. ప్రమాదంలో వెంటక్ రెడ్డి తీవ్రంగా గాయడగా స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు చెప్పారు. వెంకట్ రెడ్డి మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 5, 2025

జడ్చర్ల: రోడ్డు ప్రమాదం.. UPDATE

image

జడ్చర్లలోని ఫ్లైఓవర్‌పై గురువారం కంటైనర్‌ను స్కార్పియో ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. SI జయప్రసాద్ వివరాల ప్రకారం.. కొంపల్లికి చెందిన రోహిత్‌తో పాటు మరో ఇద్దరు స్కార్పియోలో కొడైకెనాల్ నుంచి HYDకు వెళ్తుండగా వేగంగా కంటైనర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రోహిత్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 4, 2025

MBNR: PU STUFF.. విజేతలు మీరే..!

image

పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకులకు క్రీడా పోటీలు నిర్వహించారు.
✒క్రికెట్ విజేత:ప్రొ.రమేష్ బాబు జట్టు
రన్నర్స్:Dr.N.చంద్ర కిరణ్ జట్టు
✒కార్రోమ్స్(మహిళ విభాగం)
విజేతలు:చిన్నాదేవి & శారద
రన్నర్స్:స్వాతి & N.శారద
✒వాలీబాల్(పురుష విభాగం)
విజేతలు:ప్రొ.G.N శ్రీనివాస్ జట్టు
రన్నర్స్:ప్రొ.రమేష్ బాబు జట్టు
✒త్రో బాల్(మహిళ విభాగం)
విజేతలు:రాగిణి & టీం
రన్నర్స్:కల్పన & టీం.

News September 4, 2025

MBNR: PU STUFFకు ముగిసిన క్రీడలు

image

పాలమూరు యూనివర్సిటీలో టీచర్స్ డే సందర్భంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అధ్యర్యంలో బోధన, బోధనేతర సిబ్బందికి నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడలు నేటితో ముగిశాయి. యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్యపూస రమేష్ బాబు పర్యవేక్షించారు. ఫిజికల్ డైరెక్టర్ డా.వై.శ్రీనివాసులు, ప్రిన్సిపాళ్లు డా.మధుసూదన్ రెడ్డి, డా.కరుణాకర్ రెడ్డి, డా.రవికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.