News August 29, 2025
MBNR: కార్మిక చట్టాలను అమలు చేయాలి: సీఐటీయూ

సీఐటీయూ మహబూబ్‌నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. ఐటీ హబ్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, సంక్షేమానికి కృషి చేయాలన్నారు. భూములు కోల్పోయిన స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆర్భాటం చేసిన ప్రభుత్వం, యాజమాన్యాలు కుమ్మక్కై స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించలేదన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఏవోకు విన్నవించారు.
Similar News
News August 29, 2025
MBNR: పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి అడ్డకల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ సిబ్బంది విధులు, రికార్డులు, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది సేవలపై ఏవైనా సమస్యలు ఉంటే తాము పరిశీలిస్తామని, విధుల విభజన ప్రకారం సమర్థవంతంగా సేవలందించాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదుదారులందరికీ సమానంగా సేవలందించాలన్నారు.
News August 29, 2025
భూత్పూర్‌లో యూరియా కోసం రైతుల అవస్థలు

యూరియా కొరత వేధిస్తున్న ఈ సమయంలో భూత్పూర్‌లోని పంపిణీ కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడే టోకెన్లు ఇవ్వడం అక్కడే యూరియా పంపిణీ చేయడంతో ఇబ్బంది పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. టోకెన్ల కోసం గంటల తరబడి, యూరియా బస్తాల కోసం రోజుల తరబడి లైన్‌లో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
News August 29, 2025
పాలమూరు: ఓటర్ల జాబితాపై కలెక్టర్ సమావేశం

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ విజయేందిర బోయి సమావేశం ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా, పంచాయితీ ఓటర్ల జాబితా షెడ్యూల్‌పై అవగాహన కల్పించారు. మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామన్నారు. ఇప్పటికే ముసాయిదా జాబితాను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో అంటించామని చెప్పారు.