News December 25, 2025
MBNR: కుమారుడి అఫైర్ తండ్రి ప్రాణం తీసింది

దేవరకద్ర (M) అడవి అజిలాపురం గ్రామానికి చెందిన మైబు నెల రోజుల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేశారు. హనుమన్న, మల్లేష్, శరత్, చిన్న రాములును స్టేషన్‌కు తరలించారు. మైబు కుమారుడికి హనుమన్న మరదలితో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయంపై పెద్ద మనుషుల సమక్షంలో కుమారుడిని మార్చుకోవాలని చెప్పినా పట్టించుకోకపోవడంతో నిందితులు ఈ మర్డర్ చేశారన్నాని పోలీసులు తెలిపారు.
Similar News
News December 28, 2025
వేములవాడ: రాజన్న ఆలయంలో ఏకాంతంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 30వ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో రాజన్న సన్నిధిలో ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని, శ్రీ భీమేశ్వరాలయంలో భక్తుల సమక్షంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి నిర్వహిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆర్జిత సేవలపై పరిమితి విధించినట్లు తెలిపారు.
News December 28, 2025
పల్నాడు: ఉరేసుకుని మైనర్ మృతి

రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో బాలుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చప్పిడి తేజ ఈనెల 13 నుండి కనిపించడం లేదు. అతని తల్లి మదులత 18న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతని తండ్రి శ్రీనివాసరావు కరెంటు పని చేస్తుంటాడు. వీరికి చెందిన స్టోర్ రూమ్‌లో
బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
News December 28, 2025
ఇల్లు ఏ ఆకారంలో ఉండటం ఉత్తమం?

ఇల్లు చతురస్రం లేదా దీర్ఘ చతురస్ర ఆకారాల్లో ఉండటం ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఈ ఆకారాలు ఇంట్లో శక్తిని సమతుల్యం చేస్తాయి. క్రమపద్ధతి లేకుండా మూలలు పెరగడం, తగ్గడం వంటి ఎగుడుదిగుడులు ఉండనివ్వవు. వంకరలు, అస్తవ్యస్తమైన ఆకృతులు ఉన్న ఇల్లు వాస్తు దోషాలకు దారితీసి అశాంతిని కలిగిస్తుంది. సరైన కొలతలతో కూడిన క్రమబద్ధమైన ఆకృతే యజమానికి శ్రేయస్సు చేకూరుస్తుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


