News December 31, 2025
MBNR: కురుమూర్తిలో నేడు గిరి ప్రదక్షిణ

అమ్మాపూర్ సమీపంలోని ప్రసిద్ధ కురుమూర్తి స్వామి క్షేత్రంలో బుధవారం ఉదయం 10:30 గంటలకు గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి వేడుకను విజయవంతం చేయాలని కోరారు. ‘పేదల తిరుపతి’గా వెలుగొందుతున్న స్వామివారి గిరి ప్రదక్షిణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు.
Similar News
News January 2, 2026
ప.గో: ‘వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి’

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం-2026 సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలన్నారు.
News January 2, 2026
2025లో శ్రీవారి ఆదాయం రూ.1,383 కోట్లు

AP: 2025లో తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ.1,383.90 కోట్లు లభించగా, ఇది 2024తో పోలిస్తే రూ.18 కోట్లు అధికం. 2.61 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డూ విక్రయాల్లోనూ రికార్డు నమోదైంది. మొత్తం 13.52 కోట్ల లడ్డూలు అమ్ముడవగా, గత ఏడాదితో పోలిస్తే 1.37 కోట్లు ఎక్కువ. డిసెంబరు 27న గత పదేళ్లలో అత్యధికంగా 5.13 లక్షల లడ్డూల విక్రయం జరిగింది.
News January 2, 2026
HYDలో ఎన్నికలు ఎప్పుడంటే?

గ్రేటర్ HYDను మూడు భాగాలు చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం వాటికి ఎన్నికలు కూడా నిర్వహించనుంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లను అధికారికంగా ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలనేదానిపై కాంగ్రెస్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఎండా కాలం ముగిసిన తర్వాతే అంటే జూన్ తర్వాత ‘గ్రేటర్’ ఎలక్షన్స్ ఉండవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుత కౌన్సిల్ గడువు వచ్చేనెల 10వరకు ఉంది.


