News April 4, 2025

MBNR: కులవృత్తులు నిర్వీర్యమయ్యాయి: మాజీ మంత్రి

image

నేతన్నల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కులవృత్తులు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయన్నారు. చేనేత కార్మికులకు విద్యుత్ బిల్లులు పెనుశాపంగా మారాయని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేనేత కార్మికులను ఆదుకున్నామన్నారు.

Similar News

News February 21, 2026

సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రపై నాసా సంచలన రిపోర్టు!

image

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ <<15733376>>అనివార్య కారణాలతో<<>> కొన్ని నెలలు స్పేస్‌లోనే ఉండిపోవడం తెలిసిందే. దీనిపై నాసా సంచలన రిపోర్టు రిలీజ్ చేసింది. స్టార్ లైనర్ వ్యోమనౌక తీవ్ర సాంకేతిక వైఫల్యాలకు లోనైందని తెలిపింది. అది ప్రాణాంతక వైఫల్యమని పేర్కొంటూ టైప్-ఏ ప్రమాదంగా వర్గీకరించింది. భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ను పక్కనపెట్టి ప్రయోగాన్ని చేపట్టేందుకు నాసా మేనేజర్లపై ఒత్తిడి తెచ్చినట్లుగా గుర్తించింది.

News February 21, 2026

సునీతా విలియమ్స్ యాత్ర.. అప్పుడేమైంది?

image

నాసా రిపోర్టు ప్రకారం.. 2024 జూన్‌లో వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లగానే దానిని నడిపించే ప్రొపల్షన్ వ్యవస్థలో సమస్య వచ్చింది. ISSకు చేరుకునే సరికి 5 థ్రస్టర్లు/మినీ ఇంజిన్లు పని చేయడం ఆగిపోయాయి. హీలియం లీకేజ్ మొదలైంది. అయితే డాకింగ్ జరగడంతో వ్యోమగాములు ISSలోకి వెళ్లగలిగారు. స్టార్ లైనర్‌ను ఖాళీగానే కిందికి తీసుకొచ్చారు. చివరికి 2025 మార్చిలో స్పేస్ ఎక్స్ నౌకలో సునీత, విల్మోర్ భూమికి చేరుకున్నారు.

News February 21, 2026

టైప్-ఏ ప్రమాదమంటే?

image

ఒక ప్రమాదానికి ఇచ్చే తీవ్రమైన లేబుల్ ‘టైప్ ఏ’. భారీగా ఆర్థిక, ప్రాణనష్టం వంటి పరిణామాలకు కారణమైనప్పుడు ‘టైప్-ఏ’గా నాసా పరిగణిస్తుంది. ఛాలెంజర్, కొలంబియా షటిల్ ప్రమాదాలు ఈ కేటగిరీలోకే వస్తాయి. 2003లో కొలంబియా స్పేస్ షిప్ భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు పేలిపోయింది. దీంతో భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా, మరో ఆరుగురు చనిపోయారు. ఛాలెంజర్ (1986) షటిల్ డిజాస్టర్‌లో ఏడుగురు చనిపోయారు.