News August 9, 2025

MBNR: కొత్త మొల్గరలో.. అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో వర్షం కురిసింది. అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్త మొల్గర 55.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. హన్వాడ 37.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 22.5, జడ్చర్ల 21.0, మహమ్మదాబాద్ 16.0, మహబూబ్ నగర్ 13.5, దేవరకద్ర 12.0, చిన్న చింతకుంట 9.5, కోయిలకొండ మండలం పారుపల్లి 8.5, అడ్డాకుల 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News August 8, 2025

పాలమూరు యూనివర్సిటీలో నూతన వార్డెన్‌ల నియామకం

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఉమెన్స్ హాస్టల్ జనరల్ వార్డెన్‌గా డాక్టర్ కే. నాగసుధ, ఉమెన్ మెస్ వార్డెన్‌గా ఆర్. లక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉపకులపతి జి.ఎన్. శ్రీనివాస్ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు, పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. మధుసూదన్ రెడ్డి, చీఫ్ వార్డెన్ డాక్టర్ ఎం. కృష్ణయ్య పాల్గొన్నారు.

News August 8, 2025

MBNR: PUలో 14న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్

image

పాలమూరు యూనివర్సిటీలో లాబోరేటరీస్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి డా.అర్జున్ కుమార్ Way2Newsతో తెలిపారు. ట్రైనీ సూపర్‌వైజర్/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/హెల్పర్, వివిధ పోస్టులకు SSC,INTER,ITI,బి.టెక్,B.Sc/M.Sc పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. ఫొటోలు, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెస్యూమ్‌తో హాజరుకావాలన్నారు. SHARE IT.

News August 8, 2025

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి

image

తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరు పొందిన పండుగ సాయన్న1840-1900లో పేదల పక్షాన పోరాటం చేశారు. MBNR జిల్లా నవాబ్‌పేట మండలం మెరుగోనిపల్లెకు చెందినవారు. ఆనాటి నిజాం అధికారులను, దేశ్‌ముఖ్‌లను ధైర్యంగా ప్రశ్నించారు. కొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించారు. ఈ కారణంగా 1890 డిసెంబర్ 10న నిజాం సర్కార్ ఆయన తల నరికి జిల్లా కేంద్రంలోని తిర్మలదేవుని గుట్టపై విసిరేశారు. నేడు పండుగ సాయన్న జయంతి. SHARE IT