News July 2, 2024
MBNR: కోయిల్ సాగర్‌ను పరిశీలించిన కలెక్టర్..!

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ఆనకట్ట ను కలెక్టర్ విజయేందిర సోమవారం సందర్శించారు. డ్యాం పరివాహక ప్రాంతం, డ్యాం నిండితే ప్లడ్ వాటర్ ఏ మేరకు ప్రవహిస్తుంది, కుడి, ఎడమ కాల్వల ద్వారా ఎంత ఆయకట్టుకు సాగు నీరు అందుతుందనే వివరాలు ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
Similar News
News February 19, 2026
MBNR: రంజాన్.. ఉపవాస దీక్షలు ప్రారంభం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభ సంతరించుకుంది. పవిత్రమైన రంజాన్ మాసం నేపథ్యంలో నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. నిన్న నెలవంక కనిపించడంతో ముస్లింలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మసీదులను విద్యుద్వీపాలతో అలంకరించారు. నెలరోజులపాటు తరావీ నమాజ్‌లు చేయనున్నారు. ఇప్పటికే రంజాన్ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటును కల్పిస్తూ.. GOVT ఉత్తర్వులు జారీ చేసింది.
News February 19, 2026
పాలమూరు: మోడల్ స్కూల్.. అప్లై చేసుకోండి

మహబూబ్ నగర్ (D) గండీడ్ (M) వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్) చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీలు ఉన్నాయని, ఈనెల 28లోగా https://tgms.telangana.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 19
SHARE IT
News February 17, 2026
జడ్చర్ల: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గంగాపూర్ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న మిడ్జిల్ మండలం రాణి పేట గ్రామానికి చెందిన బోయ శివ(26) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి రజని (26) కి తీవ్ర గాయాలు కాగా 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


