News December 27, 2025
MBNR: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ

CIR పోర్టల్ ద్వారా 1173 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఆస్తి నేరాల రికవరీ 29.85% నుంచి 46.89%కు పెరిగింది. 2025లో 327 ఆస్తి నేర కేసులు నమోదు కాగా..215 మందిని అరెస్టు చేసి రూ.99,83,318 విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై 32 మందిని అరెస్టు చేసి 11.850 కిలోల గంజాయి, 22 కిలోల ఆల్పరాజోలం (విలువ రూ.15,23,125) స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News January 1, 2026
మహబూబ్ నగర్ జిల్లా.. నేటి ముఖ్యాంశాలు

@ జిల్లాలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
@ మిడ్జిల్ మండలం లింబ్యాతాండ గేటు వద్ద వ్యక్తి మృతి
@ దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సమీక్ష
@ బాలానగర్ మండలం పెద్దరేవల్లిలో కారుతో ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తిపై కేసు నమోదు
@ జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత
News January 1, 2026
MBNR: ట్రాలీ బోల్తా.. 15 మేకలు మృతి

ఇల్లందు మండలం పోచారం తండా సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మేకలు మృతి చెందాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంచార జీవుల మేకల ట్రాలీ, గుండాల మండలం శెట్టిపల్లి నుండి మేత కోసం వెళ్తుండగా పోచారం గుట్ట వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాలీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా, లోపల ఉన్న 15 మేకలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
News January 1, 2026
MBNR: 31st ఎఫెక్ట్.. 86 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31stన మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్‌లతో పాటు ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. మొత్తం 86 మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని వెల్లడించారు.


