News December 27, 2025

MBNR: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ

image

CIR పోర్టల్ ద్వారా 1173 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఆస్తి నేరాల రికవరీ 29.85% నుంచి 46.89%కు పెరిగింది. 2025లో 327 ఆస్తి నేర కేసులు నమోదు కాగా..215 మందిని అరెస్టు చేసి రూ.99,83,318 విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై 32 మందిని అరెస్టు చేసి 11.850 కిలోల గంజాయి, 22 కిలోల ఆల్పరాజోలం (విలువ రూ.15,23,125) స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News January 1, 2026

పాలమూరు వాసికి విశిష్ట రంగస్థల పురస్కారం

image

2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన డాక్టర్ కోట్ల హనుమంతరావుకు వరించింది. బాలనటుడిగా రంగ ప్రవేశం చేసిన ఈయన, రంగస్థల కళల్లో పీహెచీ పూర్తి చేశారు. ప్రస్తుతం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పురస్కారాన్ని ఈనెల 2న హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రదానం చేయనున్నారు. #CONGRATULATIONS

News January 1, 2026

MBNR: పార్టీకి ద్రోహంచేసేవారిని క్షమించను: ప్రెసిడెంట్

image

సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం మనందరి అదృష్టమని,పార్టీకి ద్రోహంచేసేవారిని క్షమించబోమని డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ వెల్లడించారు. భూత్పూర్‌లో నూతన సర్పంచుల సన్మాన ఆయన పాల్గొని మాట్లాడారు. సర్పంచులు, ఇతర సభ్యులు,స్వతంత్ర, ఇతర పార్టీల నుంచి కొత్తగా పార్టీలోకివచ్చే అందరూ సమిష్టిగాఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ, పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవాలని ఆయన కోరారు.

News January 1, 2026

MBNR:News Year..స్టాల్స్ ఏర్పాటుకు ఆహ్వానం

image

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ లోని స్థానిక మయూరి ఎకో పార్క్‌కు అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున పార్క్ లో రుసుముతో కూడిన వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకున్న వారు స్థానిక పార్క్ లో సంప్రదించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.