News October 8, 2024
MBNR: గణనీయంగా పెరిగిన BSNL.. త్వరలో 4G టవర్స్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 19 లక్షల చరవాణి, 6వేల వరకు FTTH కలెక్షన్లు ఉన్నాయి. జూలైలో 11,305, ఆగస్టులో 12,718 మంది కొత్తగా BSNL సిమ్ కార్డులు కొనుగోలు చేశారు. గత 3 నెలల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 108 ప్రాంతాల్లో 4G టవర్లు ఏర్పాటు చేశామని, ఇంకా 60 4G టవర్లు అందుబాటులో తీసుకొస్తామని డీజీఎం వెంకటేశ్వర్లు తెలిపారు.
Similar News
News December 14, 2025
MBNR: ఆరు మండలాల్లో 79.30 శాతం పోలింగ్

మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, చిన్న చింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల్లో ఒంటిగంట వరకు 79.30% పోలింగ్ నమోదైంది. దేవరకద్ర మండలంలో అత్యధికంగా 88% పోలింగ్ జరగ్గా, మిడ్జిల్‌లో 73% నమోదైంది. మొత్తం 1,46,557 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.
News December 14, 2025
MBNR: 11 గంటల వరకు 55 శాతం పోలింగ్

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 06 మండలాలలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉదయం 07 గంటల నుంచి 11 గంటల వరకు దాదాపు 55 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చిన్నచింతకుంట, కౌకుంట్ల, హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, దేవరకద్ర మండలాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
News December 14, 2025
MBNR: రెండో విడత ఎన్నికలు.. గెట్ రెడీ!

MBNR జిల్లాలోని హన్వాడ(35 GP), సీసీకుంట(18), దేవరకద్ర(18), కోయిలకొండ(44), కౌకుంట్ల(12), మిడ్జిల్(24) మండలాల్లోని 151 GPలకు నేడు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 151 సర్పంచ్ పదవులకు, 1,334 వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.


