News August 26, 2025
MBNR: గణేష్ ఉత్సవాల కోసం మార్గదర్శకాలు

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి, వినాయక మండపాల నిర్వాహకులు పాటించాల్సిన సూచనలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కరపత్రం ప్రకారం, ప్రతి మండపం వద్ద కనీసం ముగ్గురు వాలంటీర్లు ఉండాలి. మండపాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. అలాగే, కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ జాగ్రత్తల వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించవచ్చు.
Similar News
News August 25, 2025
చిన్నచింతకుంట: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చిన్నచింతకుంటలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామ్ లాల్ నాయక్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎస్.రాము(39)మేస్త్రి పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఊకచెట్టు వాగు చెక్ డ్యామ్‌లో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ వరద నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
News August 24, 2025
MBNR: ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ర్యాగింగ్‌లో పాల్గొనే విద్యార్థులను కళాశాల నుంచి తక్షణమే బహిష్కరిస్తారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తారని తెలిపారు. ర్యాగింగ్ అనేది విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే కాదు, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.
News August 24, 2025
MBNR: వినాయక చవితికి పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ జానకి అన్నారు. వినాయక చవితి వేడుకలను పరిష్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వివాదాస్పద ప్రాంతాలలో దారికి అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయకూడదన్నారు. అత్యవసర సేవలకు ఇబ్బందులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలన్నారు.