News August 17, 2025

MBNR: గణేష్ మండపాలు.. అప్లై చేసుకోండి- SP

image

తెలంగాణ రాష్ట్ర పోలీసు వెబ్‌సైట్‌లో గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులకు అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. భద్రత, బందోబస్తు దృష్ట్యా https://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. పోలీసు శాఖ ఆన్‌లైన్ ద్వారానే అనుమతులను మంజూరు చేస్తుందని, అనంతరం వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. #SHARE IT

Similar News

News August 17, 2025

RR: దయనీయంగా ఆదర్శ ఉపాధ్యాయుల పరిస్థితి

image

తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో గంటల ప్రతిపాదికన విధులు నిర్వహిస్తున్న బోధన సిబ్బంది పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత మూడు నెలలుగా వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నామని, కుటుంబ పోషణ భారంగా మరి అప్పుల పాలవుతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పొరుగు సేవల సిబ్బంది కంప్యూటర్ ఆపరేటర్, పీడీ, నైట్ వాచ్‌మెన్, ఆఫీస్ సబార్డినేట్‌లకు సైతం 5నెలలకు పైగానే వేతనాలు రాలేదు.

News August 17, 2025

సిరిసిల్ల: ’శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి’

image

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లాలోని గణేష్ మండపం నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/ వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమాచారం ద్వారా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు. పోలీసులు ఆన్లైన్ ద్వారానే గణేష్ మండపాలకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు.

News August 17, 2025

BCCI కొత్త రూల్.. ICC అనుసరించాలా?

image

BCCI కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఇక నుంచి డొమెస్టిక్ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఏ ప్లేయరైనా గాయపడి, ఆడలేని స్థితిలో ఉంటే వారి స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకోవచ్చు. ఈ రూల్ మల్టీ డే(వన్డే, టీ20లు కాకుండా) ఫార్మాట్‌ మ్యాచ్‌లకే వర్తిస్తుంది. ఇటీవల ENGతో టెస్ట్ సిరీస్‌లో పంత్, వోక్స్‌ తీవ్ర గాయంతో ఆడటానికి ఇబ్బందిపడిన నేపథ్యంలో ICC కూడా దీన్ని అమలు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమంటారు?